గూఢచారి టీజర్ విడుదల

నటుడు అడివి శేష్ హీరోగా నటిస్తున్నతాజా చిత్రం ‘గూఢచారి’. దీనికి సంబంధించిన టీజర్‌ను ప్రముఖ హీరోయిన్‌, సమంత అక్కినేని చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ్ల హీరోయిన్‌గా చేస్తున్నారు. నూతన దర్శకుడు శశికిరణ్‌ తిక్కా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు ప్రకాష్‌ రాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. నటి సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘దొంగాట’, ‘క్షణం’, ‘అమీతుమీ’ లాంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అడివి శేష్. బాహుబలి చిత్రంలో భద్ర అనే క్యారెక్టర్లో కనిపించి ఫుల్ ఫేమస్ అయ్యాడు.

అభిషేక్ పిక్చర్స్ పీపుల్స్ మీడియా, విస్టా డ్రీమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్‌, కురివెళ్ల, రాకేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను వచ్చేనెల 3న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఏజెంట్ పాత్రలో అడవి శేష్ లుక్ అదిరిందని అంటున్నారు. సినిమా షూటింగ్ ఎక్కువగా అమెరికా, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, పుణె, హైదరాబాద్, విశాఖ పరిసరాల్లో జరిగింది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చారు.