‘గూఢచారి’ ట్రైలర్‌

యువ కథానాయకుడు అడివి శేష్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘గూఢచారి’. ఈ చిత్రాని శశి కిరణ్‌ టిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకం పై రూపొందుతున్న ఈ సినిమాను అభిషేక్‌ నామా, అభిషేక్‌ అగర్వాల్‌, టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్‌ పాకాల స్వరాలు అందిస్తున్నా ఈ సినిమా ఆగష్టు 3న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో 2013లో మిస్ ఇండియా ఎర్త్ శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌ గా నటిస్తోంది. నాగార్జున మేనకోడలు సుప్రియ ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు.

గూఢచారి సినిమా సంబంధించిన ట్రైలర్‌ను శుక్రవారం హీరో నాని చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్‌ అద్భుతంగా ఉంది అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘నాన్న దగ్గరికి వెళ్తున్నామా.. నాన్నని కాపాడలేకపోయాను రా’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. నాన్నలా అవ్వాలి అనుకోవడం తప్పా?’ అని అడివి శేష్‌ అంటే.. ‘చచ్చిపోతావ్‌ రా’ అని ప్రకాశ్‌రాజ్‌ కోపంగా జవాబు ఇచ్చారు. ఈ చిత్రంలో అడివి శేష్‌ అర్జున్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జున్‌ దేశం విడిచి వెళ్లకూడదు అంటూ పోలీసు అధికారులు ఆయన వెంట పడటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజం చెప్పు అర్జున్‌? ఎవరు నువ్వు? అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ముగుస్తుంది.