గౌతమ్ ఎదుగుతుంటే.. తండ్రిగా గర్వంగా ఉంది: మహేష్‌

ఘట్టమనేని గౌతమ్ కృష్ణ 12 వ పుట్టినరోజు సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ చక్కటి మెసేజ్ ఇచ్చారు. గౌతమ్ కృష్ణ యువకుడిగా ఎదుగుతుంటే.. ఒక తండ్రిగా గర్వంగా ఉంది” అని ఇన్‌స్టాగ్రామ్ లో మహేష్ బాబు పేర్కొన్నారు.

సినిమాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. మహేష్ తన కుటుంబానికి కూడా అంతే విలువను, ప్రాధాన్యతను ఇస్తుంటారు. సినిమా గ్యాప్ దొరికితే కుటుంబంతో సరదాగాఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.