గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించిన విజయ్‌

ప్రస్తుతం గ్రీన్‌ చాలెంజ్‌ ట్రెండ్‌ అవుతోంది. పలువురు సినీ రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు తమ సన్నిహితులకు గ్రీన్‌ చాలెంజ్‌ను విసురుతున్నారు. పచ్చదనాన్ని కాపాడేందుకు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు మొక్కలు నాటుతూ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

తాజాగా ఈ లిస్ట్‌లో విజయ్‌ దేవరకొండ కూడా చేరిపోయాడు. తనకు కిడాంబి శ్రీకాంత్‌, బొంతు రామ్మోహన్‌లు విసిరిన హరితహారం సవాల్‌ను విజయ్‌ స్వీకరింబాడు. , కాకినాడ యువకులతో కలిసి మొక్కలు నాటారు. తరువాత వారితో కలిసి భోజనం చేస్తూ సరదాగా గడిపారు. ఈ విషయాన్ని విజయ్‌ సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. తన స్నేహితులను నామినేట్‌ చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇటీవల గీత గోవిందం సినిమాతో ఘనవిజయం సాధించిన విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాక్సీవాలా, నోటా సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు.