గ్రౌండ్ రిపోర్ట్ః విజయవాడ సెంట్రల్

ఏపీ రాజధానికి మూల కేంద్రమైన విజయవాడలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ లో గట్టి ప్రత్యర్థులు నిలబడ్డారు. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ‘విజయవాడ సెంట్రల్’ ఏర్పడింది. ఆ వెంటనే 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున మల్లాది విష్ణు ఇక్కడ నుంచి పోటీచేసి గెలిచారు.

అ తర్వాత 2014 ఎన్నికల్లో ఇదే సెంట్రల్ సీటు నుంచి టీడీపీ తరుఫున నిలబడ్డ బొండా ఉమా 30వేలకు పైగా గెలుపొందాడు. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి నిలబడ్డ గౌతం రెడ్డి ఓడిపోయారు.
అయితే ఈసారి సెంట్రల్ లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. నెలరోజుల్లోనే ఎన్నికలు దగ్గరపడ్డాయి. టీడీపీ నుంచి బోండా ఉమానే మరోసారి బరిలోకి దింపారు. కానీ అయిదేళ్లలో బొండాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రజలను చులకనగా చూడడం.. భూ కబ్జాలు , దందాలు, అవినీతిని ప్రోత్సహించడంతో బొండాపై నియోజకవర్గంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మరోవైపు సీనియర్ నేత బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన మల్లాది విష్ణు వైసీపీ తరుఫున సెంట్రల్ బరిలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. మల్లాది విష్ణు కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అలాగే మల్లాది విష్ణు సౌమ్యుడు.. క్లీన్ ఇమేజ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్త మిత్రుడు కావడంతో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. టీడీపీ మీద వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని మల్లాది విష్ణు నమ్మకంగా ఉన్నారు.

ఇక సెంట్రల్ సీటును జనసేన పోటీచేయకుండా మిత్రపక్షం వామపక్షానికి కేటాయించడంతో అంతిమ పోటీ బొండా, మల్లాది విష్ణు మధ్యనే నెలకొంది. అయితే సర్వేలన్నీ మల్లాది విష్ణు గెలుపు ఖాయమని చెప్పడంతో ఆయన గెలవడం ఖాయమని విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు.