‘చంద్రన్న పెళ్లికానుక’ పథకంలో స్వల్ప మార్పులు

‘చంద్రన్న పెళ్లికానుక’ పై అమరావతిలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దుల్హన్, గిరిపుత్రిక కల్యాణ పథకాల పేర్లల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దుల్హన్-చంద్రన్న పెళ్లికానుక, గిరిపుత్రిక-చంద్రన్న పెళ్లికానుక గా మార్చాలని సీఎం నిర్ణయించారు. ‘చంద్రన్న పెళ్లికానుక’ పొందే అంశంలో తలెత్తుతున్న సాంకేతిక ఇబ్బందులపై సమావేశంలో చర్చ జరిగింది. సాంకేతిక ఇబ్బందులను ఈనెల 10లోగా పరిష్కరించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

వరుడు దారిద్ర్య రేఖకు ఎగువున వున్నా.. వధువు దారిద్ర్య రేఖకు దిగువున వుంటే ‘చంద్రన్న పెళ్లికానుక’ కు అర్హులుగా గుర్తించాలని సీఎం సూచించారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన వారిని పెళ్లి చేసుకునే వధువుకు కూడా ‘చంద్రన్న పెళ్లికానుక’ వర్తిస్తుందని తెలిపారు చంద్రబాబు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వరుడుకు మాత్రమే ఈ మినహాయింపు ఉందని సీఎం తెలిపారు.