చరణ్ కాపీ డైరెక్టర్ అన్నది ఎవరినో!

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తోన్న ‘రంగస్థలం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో చరణ్ లుంగీ, పూల చొక్కా, గెడ్డంతో డీగ్లామర్ గెటప్ తో
కనిపించనున్నాడు చరణ్. ఇలాంటి సినిమాను రామ్ చరణ్ చేస్తున్నాడంటే పరోక్ష కారణం శ్రీనువైట్లేనట. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా వెల్లడించాడు. రంగస్థలం సినిమా విడుదల సందర్భంగా మీడియా పేరంటాలు స్టార్ట్ చేసాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్రూస్ లీ సినిమానే తన ఆలోచనా విధానాన్ని మార్చేసిందన్నారు.అందువల్లే ఇప్పుడు డీవీడీలు చేతికిచ్చే డైరక్టర్లను దూరం పెట్టేసానన్నారు. ధృవ, రంగస్థలం లాంటి సినిమాల వైపు తన దృష్టి మళ్లడానికి, తనలో పరిణితి రావడానికి ఓ విధంగా బ్రూస్ లీనే కారణం అన్నాడు. అంటే ఏంటన్నమాట..? బ్రూస్ లీ పరాజయం తరువాత జనాలు తన నుంచి ఏం కోరుకోవడం లేదో అన్నది తెలిసి వచ్చిందన్నమాట. అవును ఇంతకీ డీవీడీ డైరక్టర్లు అంటే ఎవరిని అన్నట్లో..?