చరణ్ కు అన్నగా మరో హీరో..?

టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన హీరో ఆర్యన్ రాజేష్ ఇక్కడ సరైన హిట్లు లేకపోవడంతో తమిళంలో కొన్ని సినిమాలలో నటించాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ నటుడు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రామ్ చరణ్ కు అన్నయ్యగా కనిపించబోతున్నాడని సమాచారం. చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీ కనిపించనుంది. కథ ప్రకారం సినిమాలో హీరో అన్నయ్య పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉందని సమాచారం. ఆ పాత్ర కోసం బోయపాటి ఆర్యన్ రాజేష్ ను ఎంపిక చేసుకున్నారు. ఆర్యన్ రాజేష్ భార్య పాత్రలో నటి అనన్య కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.