చార్మినార్‌ షాపింగ్‌లో సారా

బాలీవుడ్‌ నటుడు సైప్‌ అలీ ఖాన్‌ కూరార్తె సారా అలీ ఖాన్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. ‘సింబా’ అనే చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో వచ్చిన టెంపర్‌కు రీమేక్‌గా రోబోతోంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటిలో జరుగుతోంది. రంజాన్‌ పండుగ వస్తున్న సందర్భంగా సారా, తన తల్లి అమృతతో కలిసి చార్మినార్‌లో షాపింగ్‌ చేశారు.


అక్కడ సాధారణ మహళల్లా ఇద్దరూ కలిసి గాజులు కొంటున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అమృత హిందీలో నటించిన చిత్రాలు తక్కువే. సారాకి కూడా ఇది తొలి చిత్రమే కావడంతో ఆమెకు ముంబయిలో ఉన్నంత పాపులారిటీ ఇక్కడ లేదు. దాంతో అక్కడ వారిని ఎవ్వరూ గర్తుపట్టలేకపోయారు. ‘సంబా’ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటిస్తున్నారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఈ సినిమాను కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. సారా నటించాల్సిన తొలి చిత్రం కేదార్‌నాథ్‌ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. డిసెంబరు 28న సింబా ప్రేక్షకుల ముందుకు రానుంది.