‘చి॥ల॥సౌ॥’ ట్రైలర్‌

సుశాంత్‌, రుహానీ శర్మ హీరోహీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘చి॥ల॥సౌ॥’. ఈ సినిమాను సిరుణి సినీ కార్పొరేషన్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ విడుదల చేస్తోంది. ప్రశాంత్‌ ఆర్‌ విహారి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆగస్టు 3న సినిమా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, అనుహాసన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ రోజు (శనివారం) ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తుంది. దీని చూసిన ప్రముఖులు ట్విటర్‌ వేదికగా చిత్ర బృందాన్ని ప్రశంసించారు.

ఇక ఈ ట్రైలర్‌ లో సుశాంత్‌ తన గత సినిమాల్లో లాగా ఫైట్స్‌, భారీ పంచ్‌ డైలాగ్స్‌ లాంటి మాస్‌ ఎలిమెంట్స్‌ జోలికి పోకుండా కేవలం కథకు, సన్నివేశాలకు తగ్గట్టుగా సింపుల్‌గా, కొత్తగా కనిపించాడు. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే పెళ్లి చూపుల వ్యవహారం ఆధారంగా ఈ చిత్ర కథను రూపొందిస్తున్నట్లు ఉన్నారు. కాగా ఈ చిత్రం ఆగష్టు 3 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ప్రముఖ నటి కాజల్‌ ఈ చిత్రం ట్రైలర్‌ గురించి ప్రశంసిస్తూ.. ట్రైలర్‌ సూపర్‌ కూల్‌గా, యంగ్‌గా, ఫ్రెష్‌గా ఉంది. సుశాంత్‌, రాహుల్‌, మొత్తం యూనిట్‌ సభ్యులకు అభినందనలు‌. నిజాయతీగా మీరు చేసిన కృషి మీ విజయానికి కారణం అవుతుంది. ఈ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నా అని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.