చికాగో సెక్స్‌ రాకెట్‌ పై స్పందించిన రెజీనా

ఈ మధ్యకాలంలో చికాగో సెక్స్‌ రాకెట్‌ ఇండస్ర్టీని ఓ ఊపు ఊపేసంది. ఈ రాకెట్‌లో పలువురు హీరోయిన్‌లు, బుల్లితెర నటులు, యాంకర్స్‌ పేర్లు బయటికి వచ్చాయి. కొందరు రెజీనా పేరును కూడా పరోక్షంగా ప్రస్తావించారు. అయితే తాజాగా ఈ విషయంపై రెజీనా కొంచెం ఘాటుగానే స్పందించింది. సెక్స్‌ రాకెట్ లో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తన పై వస్తున్న వార్తలని రూమర్లుగా కొట్టిపారేసింది. ఒకరి గురించి మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది. తొందరపడి స్పందించకూడదని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని ఈ బ్యూటీ తెలిపింది.

 

‘చికాగో సెక్స్‌ రాకెట్‌ తో నాకు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. నిజాలు తెలియకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్‌ కాదు. ఏదైనా మాట్లాడేప్పుడు అందులో నిజం ఎంతో తెలుసుకొని బాధ్యతగా వ్యవహరించాలి. చేసే పనిలో నిజాయితీ ఉంటే దేని గురించి మాట్లాడనక్కర్లేదు. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి. సినిమా ఇండస్ర్టీ ఒక్కటే చెడ్డది అనడం సరికాదు. మిగతా అన్ని రంగాలలోనూ.. ఇటువంటి సమస్యలు ఉంటాయి. కానీ మేము కెమెరా ముందు ఉంటాం కాబట్టి తొందరగా టార్గెట్ అవుతున్నాం. ఇలాంటి వివాదాలు గురించి మాట్లాడకపోవడమే మంచిది. మాట్లాడితే మళ్లీ నన్నే కార్నర్‌ చేస్తారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాల గురించి మాట్లాడతాను. అన్ని విషయాలకు సమాధానం ఇస్తాను’ అంటూ తేల్చిచెప్పింది.