చిట్టిబాబు సందడి షురూ!

రాంచరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ చిత్రంలో నటిస్తున్నాడు. వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాలేదు. ఇక రంగస్థలం చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. సినిమాలో చరణ్.. చిట్టిబాబు అనే చెవిటివాడి పాత్రలో కనిపించనున్నాడు. రీసెంట్ గా విడుదలైన ‘ఎంత సక్కగున్నావే’ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
 ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ రేపు విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇక ‘రంగా రంగా రంగస్థలాన’ అంటూ స్టార్ట్ అయ్యే ఈ టైటిల్ సాంగ్ రేపు(శుక్రవారం) సాయంత్రం 6గంటలకు విడుదల కానుంది. సాంగ్ ఎలా ఉండబోతోందో దేవి ఓ బిట్ వినిపించాడు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు. మార్చి ౩౦న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.