చిరుకి కూడా కథ చెప్పడట!

మెగా ఫ్యామిలీ లో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమా కి సంబంధించి పక్క స్క్రిప్ట్, స్టొరీ చిరంజీవి దగ్గర ఉండాల్సిందే. అయితే అది వేరే దర్శకుల దగ్గర కాని ఇప్పుడు సీన్ లో కి ఎంటర్ అయ్యింది దర్శక ధీరుడు జక్కన్న. రాజమౌళి ఏదైనా సినిమా తీసే తప్పుడు దానికి సంధించిన స్టొరీ, స్క్రిప్ట్ ఎవరితోనూ పంచుకోడు. ఆయన అనుకున్నది చేస్తాడు. తాజాగా రాజమౌళి మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు.ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో రాజమౌళి చాలా సైలెంట్ గా ఉంటున్నాడట. కేవలం సినిమా లైన్, ఏ జోనర్ అనే విషయాలను మత్రమే చిరుకి చెప్పినట్లు తెలుస్తోంది. అంతేతప్ప కథను మాత్రం చెప్పలేదట. సాధారణంగా చరణ్ సినిమాలను ఫైనల్ చేసేది చిరునే. అలాంటిది రాజమౌళి మాత్రం ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తోంది.