చిరు చేతుల మీదుగా తేజ్ ఆడియో

సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా “తేజ్‌ ఐ లవ్‌ యు”. ఈ చిత్రానికి ప్రేమ కథల స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను క్రియేటివ్‌ కమర్షియల్‌ బ్యానర్‌ పై కేయస్‌ రామారావు, వల్లభలు నిర్మిస్తున్నారు. ఇటీవల వరుస ప్లాప్‌ లతో ఇబ్బందుల్లో పడ్డ సాయి ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే ఎలాంటి ప్రయోగాల జోలికి పోకుండా తన వయసుకు తగ్గ రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న ఈ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. జూన్‌ 9న ఆడియో రిలీజ్‌ వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ సరసన అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.