చిరు, పవన్ లపై వర్మ విమర్శలు!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవిపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో విమర్శలు కురిపించారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని చిరు గతాన్ని గుర్తుచేస్తూ దాన్ని పవన్ ప్రస్తుతం తీరుతో పోలుస్తూ వర్మ చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపాయి. పవన్ కళ్యాణ్ మెల్లమెల్లగా చిరజీవిలా మారుతున్నాడని, వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీను వదిలి సొంతంగా పోటీ చేస్తేనే జనాలు నమ్ముతారని పరోక్షంగా కొన్ని మాటలు అన్నారు.
జయప్రకాశ్ నారాయణ్, ఉండవల్లి వంటి వారిని కలుపుకొని క్రెడిబిలిటీ సాధించినా.. వచ్చే ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేయకపోతే మాత్రం చిరంజీవిలానే పెద్ద తప్పు చేసినవాడవుతావని అన్నారు. ఇది ఇలా ఉండగా.. జీఎస్టీ సినిమా విడుదల సమయంలో వర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా సంఘాలు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల విచారణకు తన లాయర్ తో కలిసి ఈరోజు పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు వర్మ.