చెన్నైలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

చెన్నైలో భారీ సెక్స్‌రాకెట్ గుట్టు రట్టయింది. ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా యువకులకు గాలం వేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు యువకులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళ సినీ, సీరియల్‌ నటి జయలక్ష్మి ఫిర్యాదుతో ఈ ఉదంతం బయట పడింది. రిలేషన్‌షిప్ డేటింగ్ పేరుతో కొంతకాలం నుంచి తన ఫోన్‌కు అసభ్య మెసేజ్‌లు వస్తున్నాయని ఆమె పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

నిందితులను అరెస్ట్ చేసి వారి సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ ఫోన్లలోని మెసేజ్‌లు, ఫొటోలు చూసి ఖంగు తిన్నారు. తమిళ నటుల అసభ్య ఫొటోలు, వారి రేట్లతో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఓ యువ నటితో గడిపేందుకు రూ. 40 లక్షలు చెల్లించాలంటూ ఓ యువకుడికి మెసేజ్‌ పెట్టారు. సుమారు 70 మంది యువతుల ఫొటోలు పెట్టి వారికి రేట్లు ఫిక్స్ చేసి యువకులకు గాలం వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మీకు డేటింగ్ చేయడం ఇష్టమేనా.. మీతో వీఐపీలు రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ దానికోసం రూ. 30 వేలు నుంచి రూ. 3 లక్షల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఓ నటికి మెసేజ్ పంపించడంతో ఆమె ఫిర్యాదు మేరకు ఈ బాగోతం బయటపడింది.

నిందితులు చేసిన వాట్సప్‌ చాటింగ్‌ను పోలీసులు సేకరించారు. ఫొటోలు, రేట్లు ఉన్న ఫొటో ఆల్బమ్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. వీరికి అండగా రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.