చైనాలో మెగాస్టార్ ‘సై.. రా’!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సై రా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు.  స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథను ‘సైరా’ గా తీస్తున్న మెగా కాంపౌండ్ భారీ స్కెచ్ కి చైనా కూడ తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఈమూవీ తదుపరి షెడ్యూల్ షూటింగ్ కోసం సైరా యూనిట్ మొత్తంగా చైనా వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చైనాలోని చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఒక భారీ పురాతన కోటలో ఈసినిమాకు సంబంధించిన ఒక కీలక షెడ్యూల్ ను చిత్రీకరిస్తారని టాక్.
చైనాలో ఎంటర్టైన్మెంట్ ట్యాక్సులు చాల తక్కువ కాబట్టి కీలకమైన ఒక భారీ షెడ్యూల్ ను అక్కడ చిత్రీకరిస్తే ఖర్చులు బాగా తగ్గుతాయి అన్న ఆలోచన చరణ్ కు రావడంతో మెగా కాంపౌండ్ దృష్టి చైనా వైపు వెళ్ళినట్లు తెలుస్తోంది. దీనికితోడు ప్రస్తుతం చైనాలో ఇండియన్ సినిమాలను బాగా చూస్తున్న నేపధ్యంలో ‘సైరా’ కూడ చైనా భాషలోకి డబ్ చేసే ఆలోచన ఉండటంతో ఈమూవీ షూటింగ్ ను చైనాలో కొంత వరకు తీస్తే ఆ సన్నివేశాలు చైనాలోని సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అన్న ఆలోచన కూడ రామ్ చరణ్ కు వచ్చినట్లు తెలుస్తోంది.