జంబలకిడి పంబ సినిమా రివ్యూ

movie-poster
Release Date
June 22, 2018

సినిమా : జంబలకిడి పంబ
నటీనటులు : శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి
రచన, దర్శకత్వం : జేబీ మురళీకృష్ణ
నిర్మాతలు : రవి, జోజో జాస్,
సంగీతం : గోపీ సుందర్

‘జంబ‌ల‌కిడి పంబ‌’ అనగానే అందరికీ అల్లరి న‌రేశ్ హీరోగా ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ తెరకెక్కించిన న‌వ్వుల సంద‌డి గుర్తుకొస్తుంది. ఈ సినిమాను ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఈవీవీ రూపొందించారు. అదే పేరుతో సినిమాను రూపొందించి మనందరికీ మరోసారి కితకితలు పెట్టడానికి ముందుకొచ్చాడు హీరో శ్రీనివాస‌రెడ్డి. శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. ఈ సినిమాలో సిద్ధి ఇద్నాని హీరోయిన్‌గా నటించింది. ఇంకా వెన్నెల కిషోర్‌, పోసాని సందడి చేయబోతున్నారు.

కథ: హీరో(శ్రీనివాస్‌ రెడ్డి) ఈ సినిమాలో అతని పాత్ర పేరు వరుణ్‌ , హీరోయిన్‌ (సిద్ధి ఇద్నాని) పాత్ర పల్లవి. హీరో,హీరోయిన్‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట. పెళ్లి అయిన ఏడాదిలోనే మనస్పర్థలు వస్తాయి..దాని కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇక కలిసి జీవించలేం అని నిర్ణయించుకున్న వరుణ్‌, పల్లవిలు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. 99 జంటలకు విడాకులు ఇప్పించిన ఫేమస్‌ లాయర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌ (పోసాని) వీరికి విడాకులు ఇప్పించి వంద మందికి విడాకులు ఇప్పించిన లాయర్‌ గా గిన్నిస్‌ రికార్డ్ సాధించాలనుకుంటాడు. కానీ వీరి ఇద్దరికి విడాకులు రాకముందే లాయర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌ ఓ యాక్సిడెంట్‌లో భార్యతో సహా చనిపోతాడు. హరిశ్చంద్ర ప్రసాద్ చేసిన పాపల కారణంగా ఆత్మగా మారిన అతని భార్యకు దూరమవుతాడు. ఇదేంటని హరిశ్చంద్ర దేవుడిని అడిగితే.. తిరిగి తన భార్యను కలుసుకోవాలంటే ‘నువ్వు విడగొట్టాలనుకున్న వందో జంటను కలిపితేనే నీ భార్య వద్దకు నిన్ను పంపుతాను’ అని చెప్తాడు. దీంతో తిరిగి భూలోకంలోకి వచ్చిన హరిశ్చంద్రప్రసాద్‌ ఏం చేశాడు.. వరుణ్‌ శరీరంలోకి పల్లవి ఆత్మను, పల్లవి శరీరంలోకి వరుణ్‌ ఆత్మని ఎందుకు మార్చాల్సి వచ్చింది.. చివరకు వరుణ్‌, పల్లవిలు ఒక్కటయ్యారా.. లేదా.. తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.

నటీనటులు : శ్రీనివాస్‌ రెడ్డి కమెడియన్‌గా మంచి గుర్తంపు తెచ్చుకున్నాడు. హీరోగానూ తన ఇమేజ్‌కు తగ్గ కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తున్నాడు. జంబ లకిడి పంబ సినిమాలోనూ అదే కంటిన్యూ చేశాడు. కొన్ని సీన్స్‌ లో లవర్ భాయ్‌లా కనిపించే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. కామెడీ పరంగా మాత్రం తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్నాడు. సిద్ధి ఇద్నానీకి ఇదే తొలి తెలుగు చిత్రమైనా చక్కటి అభినయం ప్రదర్శించింది.. చాలా సీన్స్‌ లో శ్రీనివాస్‌ రెడ్డిని డామినేట్‌ చేశారు. సాంకేతికంగా సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. సంగీతం, ఛాయాగ్రహణం బాగా కుదిరాయి. దర్శకుడు మను అటు వినోదంలోనూ, ఇటు భావోద్వేగాల విషయంలోనూ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. రుచిపచిలేని సన్నివేశాలతో సినిమాను అల్లేసినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు అంతంతమాత్రమే.

విశ్లేషణ : జంబలకిడి పంబ లాంటి క్లాసిక్‌ను టచ్‌ చేసే ధైర్యం చేసిన దర్శకుడు మురళీ కృష్ణ ఆ స్థాయిలో అలరించటంలో ఫెయిల్‌ అయ్యారు. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య జరిగే గొడవలు ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా సాగటం ప్రేక్షకులను విసిగిస్తుంది. కామెడీ సినిమా అనుకొని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు హర్రర్‌ కామెడీ, ఎమోషనల్‌ డ్రామాలను చూపించటం కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది.కేవలం దేహాలు మారడం వల్ల జరిగే పరిణామాలు, దాన్నుంచి పుట్టే వినోదంపై దృష్టిపెట్టాడు దర్శకుడు. కానీ వినోదంలోనూ కొత్తదనం లేదు. ప్రతిచోటా బలవంతంగా నవ్వించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది

ద్వితీయార్ధంలో మరింతగా కామెడీ పండించే అవకాశాలు ఉన్నా.. దర్శకుడు ఎక్కువగా ఎమోషనల్ డ్రామాగా మీద దృష్టి పెట్టడం, కామెడీ ఆశించే ప్రేక్షకులకు నిరాశకలిగిస్తుంది. ఆత్మగా పోసాని కృష్ణ మురళి పదే పదే తెరపై కనిపిస్తూ బోర్‌ కొట్టిస్తాడు. శ్రీనివాస్‌ రెడ్డి అమ్మాయి హావభావాలతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసినా చివరికి వచ్చేసరికి ఆయన నటన కూడా విసుగు తెప్పిస్తుంది. గోపి సుందర్ సంగీతం పరవాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.

హైలైట్స్
టైటిల్‌
హీరో,హరోయిన్‌ నటన
డ్రాబ్యాక్స్
కథ,కధనం
కామెడీ పండకపోవటం
సాగే కథనం

చివరిగా : కామెడీ లేని కామెడీ సినిమా

(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Critics METER

Average Critics Rating: 2
Total Critics:3

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

కామెడీ లేని కామెడీ సినిమా
Rating: 1.5/5

https://www.klapboardpost.com

జంబలకిడి పంబ.. బొమ్మ తిరగబడింది
Rating: 1.75/5

http://www.tupaki.com

పేరు చూసి మోస‌పోకండి
Rating: 1.5/5

https://www.telugu360.com