జంబలకిడి పంబ సెన్సార్‌ పూర్తి

హాస్యనటుడు శ్రీనివాస్‌రెడ్డి నటిస్తున్న చిత్రం ‘జంబలకిడి పంబ’. సిద్ది ఇద్నిని ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రధారులు. జెబి. మురళి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు రవి, జోజో జోస్‌ శ్రీనివాసరెడ్డి ఎన్‌. మాట్లాడుతూ రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది. శ్రీనివాసరెడ్డి కోసమే మా దర్శకుడు ఈ కథను తయారుచేశారు. అన్ని వర్గాలని అలరించే చిత్రమిది అన్నారు.

ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమం పూర్తయింది. ఈ నెల 22న సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. కథ నచ్చి చేసిన చిత్రమని చిత్ర కథానాయకుడు శ్రీనివాసరెడ్డి చెప్పారు. టైటిల్‌ చాలా చక్కగా కుదిరింది. టైటిల్‌ చూసి సినిమాకు వచ్చిన వారిని నిరాశపరచొద్దని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ యువతకు నచ్చే అంశాలన్నీ ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్‌ పాటకి మంచి స్పందన వచ్చింది అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్‌, ఛాయాగ్రహణం సతీష్‌ ముత్యాల