జగన్‌ను అనాలంటే వారు గుర్తొస్తారు : పవన్

పవన్ కల్యాణ్‌పై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో రెండు తెలుగు రాష్ట్రాల వీర మహిళా విభాగం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. “నన్ను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శించినా.. తిట్టినా
పట్టించుకోను. జగన్‌ ఈ మధ్యన నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. నేనూ అదే స్థాయిలో అనొచ్చు. కానీ నాకు వారింట్లోని ఆడపడుచులు, తల్లీబిడ్డలు గుర్తొస్తారు. నేను జగన్‌ను వ్యక్తిగతంగా అంటే వారెంత బాధపడతారో గ్రహించగలను” అన్నారు.

సేవా రంగంలోకి వచ్చే మహిళలకు సామాజిక వెన్నుదన్ను అవసరమని, మీ ఇల్లు, పిల్లల బాధ్యతలు వదిలి రావొద్దని, అవి చూసుకుంటూ వీలు చిక్కిన సమయంలో ప్రణాళికాబద్ధంగా పార్టీ కోసం పని చేయాలని మహిళా కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. సింగపూర్‌ లాంటి నగరం నిర్మిస్తానని, ఆ తరహాలో నిర్మాణాలు చేస్తానని చెప్పే చంద్రబాబు ఆ తరహా పాలనను అందిస్తానని మాత్రం చెప్పరని పవన్ విమర్శించారు. సింగపూర్‌లాంటి పాలన అయితే విధినిర్వహణలో వున్న
మహిళా అధికారిపై దాడి చేసిన ఎమ్మెల్యే ఈ పాటికి జైల్లో ఉండేవాడని పవన్ అన్నారు.

’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. గురువారం హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల వీర మహిళా విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సేవా రంగంలోకి వచ్చే మహిళలకు సామాజిక వెన్నుదన్ను అవసరం. మీ ఇల్లు, పిల్లల బాధ్యతలు వదిలి రావొద్దు. అవి చూసుకుంటూ వీలు చిక్కిన సమయంలో ప్రణాళికాబద్ధంగా పార్టీ కోసం పని చేయండి’ అని మహిళా కార్యకర్తలకు సూచించారు. ‘సింగపూర్‌ లాంటి నగరం నిర్మిస్తా. సింగపూర్‌ తరహా నిర్మాణాలు చేపడతానని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడిలాగే పాలన అందిస్తానని మాత్రం చెప్పరు’ అని పవన్‌ విమర్శించారు. సింగపూర్‌ లాంటి పాలనైతే విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై దాడి చేసిన ఎమ్మెల్యే జైలులో ఉండేవాడని వ్యాఖ్యానించారు.

జనసేన సంకల్పం ఏమిటనేది ప్రతివారికీ తెలియజేసేలా పార్టీ తరఫున “శతఘ్ని” పక్ష పత్రికను తీసుకొస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. పార్టీ శ్రేణులకు సిద్ధాంతాలపై అవగాహన కల్పించడంతోపాటు వారికి దిశానిర్దేశం చేసేలా రూపొందించిన కరదీపికనూ పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. డిసెంబర్‌ నాటికి పార్టీ సభ్యత్వం 50 లక్షలకు చేరుకుంటుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌ తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ చీఫ్ ఎడిటర్‌గా, తోట చంద్రశేఖర్‌ ఎడిటర్‌గా “శతఘ్ని” తొలి సంచికను ఆవిష్కరించారు.

CLICK HERE!! For the aha Latest Updates