జనసేన అధినేతకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేష్

ఈ రోజు సెప్టెంబర్‌ 2 ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతోపాటు పలువురు సెలెబ్రిటీలు ట్విట్టర్‌ ద్వారా పవన్‌ కల్యాణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌ కూడా పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఎల్లప్పుడూ ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆయనకు మంచి భవిష్యత్తు, సంతోషకరమైన జీవితం ఉండాలని కోరుకుంటున్నానని లోకేష్ ట్వీట్ చేశారు.