జపాన్ భాషలోకి మగధీర డబ్బింగ్

బాహుబలి -2′ సినిమా దేశీయ మార్కెట్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసుల వద్ద సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్ ప్రేక్షకులు ఈ బాహుబలి సినిమాకు ఫిదా అయిపోయి రాజమౌళికి అభిమానులుగా మారిపోయారు.

అందుకే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్-కాజల్ నటించిన ‘మగధీర’ చిత్రాన్ని అనువాదం చేసి జపాన్ లో రేపు విడుదల చేస్తున్నారు. సుమారు 700కు పైగా థియేటర్లలో ఈ చిత్రం విడుదలకాబోతుంది. సుమారు పదేళ్ల తర్వాత జపాన్ భాషలోకి డబ్బింగ్ చేయబడింది. మరి తెలుగు బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా జపనీయుల్ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.