జమిలి ఎన్నికలకు లా కమిషన్ గ్రీన్‌ సిగ్నల్

జమిలి ఎన్నికలపై లా కమిషన్ డ్రాఫ్ట్ రిపోర్ట్ ను విడుదల చేసింది. జమిలీ ఎన్నికలను జరపటం సమంజసమే అని తన రిపోర్ట్ లో చెప్పింది. అయితే రాజ్యాంగ సవరణ తర్వాత ఈ ప్రక్రియకు సిద్ధంకావాలని చెప్పింది. లా కమిషన్ రిపోర్ట్ బీజేపీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆ పార్టీ గత కొన్నాళ్లుగా జమిలీ ఎన్నికల నిర్వహణపై ఆసక్తి చూపుతోంది. ఏడాది పొడవునా ఎన్నికలు వస్తుంటే అభివృద్ధి కుంటుపడుతోందని వాదిస్తోంది.

ఈ మేరకు గతంలో లా కమిషన్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేఖ రాశారు. జమిలీ ఎన్నికల నిర్వహణకు పార్టీ మొగ్గు చూపుతోందని ప్రధానితో పాటు ఆ పార్టీ నేతలంతా పలు సభలో పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించి జమిలీ ఎన్నికలపై అభిప్రాయాలను సైతం స్వీకరించారు. మరోవైపు… ప్రతిపక్షాలు మాత్రం దేశ మంతా ఓకేసారి ఎన్నికలు నిర్వహించటం వ్యతిరేకిస్తున్నాయి.