జయకు నివాళులు అర్పించిన సినీ ప్రముఖులు

తెలుగు సినీ దర్శకురాలు బి.జయ గుండెపోటుతో కన్నుమూశారు. ఆమెకు పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని జయ స్వగృహంలో ఆమె భౌతికకాయానికి మహేశ్‌బాబు దంపతులు, వెంకటేశ్‌, వంశీ పైడిపల్లి, సుకుమార్‌, ఆది, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, నందినిరెడ్డి, ఝాన్సీ, ఉత్తేజ్‌, గుణశేఖర్‌, నృత్యదర్శకుడు శేఖర్‌, మంచుమనోజ్‌ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. జయ కుటుంబసభ్యులను పరామర్శించారు.

జయ మరణం టాలీవుడ్ కు తీరని లోటని, జయలాంటి దర్శకురాలు టాలీవుడ్ కు అరుదుగా దొరుకుతుంటారని మహేష్ బాబు అన్నారు. బీఏ రాజు కుటుంబానికి మహేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జయ ఆకస్మిక మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. దీనిలో భాగంగా జయతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.