HomeTelugu Newsజాన్వీ ఫస్ట్‌ మేగజైన్‌ ఫోటో షూట్‌

జాన్వీ ఫస్ట్‌ మేగజైన్‌ ఫోటో షూట్‌

దివంగత మహానటి శ్రీదేవి కుమారై జాన్వీ హీరోయిన్‌గా ‘థడక్‌’ సినిమా రూపొందుతున్న విషయం తేలిసిందే. ఈ సినిమా జాన్వీకి మొదటి చిత్రం. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. అయితే జాన్వీ సినిమా కెరియర్‌ ప్రారంభించక ముందునుంచే స్టార్‌ ఇమేజ్‌ సంపాదించుకుంది. తాజాగా జాన్వీ ప్రముఖ మ్యాగజైన్‌ ‘వోగ్‌’ ఫోటోషూట్‌లో పాల్గొంది.

3 15

ఈ నేపధ్యంలో జాన్వీ ముఖచిత్రంతో కూడిన కవర్‌ పేజీ విడుదలైంది. దీనిని జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది. దీనితో పాటు ‘ఈ ఫొటో ను షేర్‌ చేయడాన్ని ఎంతో ఎక్సైటెడ్‌గా ఫీల్‌ అవుతున్నాను. ఇది మ్యాగజైన్‌ కోసం నా తొలి కవర్‌ ఫొటో. ‘వోగ్‌ ఇండియా ‘ నాకు ఇంతటి ప్రత్యేక అనుభూతిని కలిగించినందుకు థ్యాంక్స్‌’ అంటూ కామెంట్‌ రాసింది. ఈ ఫొటోను చూసిన ఆమె ఫ్యాన్స్‌ అచ్చం శ్రీదేవిలానే ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu