ఝాన్సీ లక్ష్మీ బాయికి కంగనా నివాళి

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మణికర్ణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తేలిసిందే. భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం గురించి చెప్పగానే గుర్తొచ్చేంది ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. దేశభక్తి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆమె సాగించిన సంగ్రామం ఇప్పటికీ చరిత్రలో గాథలుగా నిలిచిపోయాయి. జూన్ 18 ఝాన్సీ లక్ష్మీబాయి 160వ వర్ధంతి .

ఈ సందర్భంగా తన కొత్త చిత్రం మణికర్ణికలో ఝూన్సీ రాణి పాత్ర పోషిస్తున్న కంగనా రనౌత్ సినిమా కొత్త పోస్టర్ విడుదల చేసి తన నివాళి అర్పించింది. మణికర్ణిక కొత్త పోస్టర్ లో లక్ష్మీబాయిగా నటించిన కంగనా స్కెచ్ అద్భుతంగా చిత్రించారు. దానిపై చరిత్రలో అత్యంత ధైర్యశాలి అయిన మహిళను స్మరించుకుంటూ అని రాశారు. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వంలో వహిస్తున్నారు.