టాటూ రహస్యం చెప్పిన సమంత

అక్కినేని కోడలు, టాలీవుడ్‌ ప్రముఖ నటి సమంత ఇప్పుడు వరుస విజయాలతో దూపుకుపోతోంది. తాజాగా ఆమె చేతిలో ఆరు ప్రాజెక్టు లు ఉన్నాయి. ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘యూటర్న్‌’ ఈ చిత్రంలో సమంత జర్నలిస్ట్‌గా నటిస్తుంది. ‘యూటర్న్‌’ ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. తన చేతిపై ఉన్న టాటూ రహస్యం చెప్పింది.

ఆ టాటూ తనకు, తన భర్తకు(నాగా చైతన్య) గుర్తుగా వేయించుకున్ననని, మేమిద్దరం అని, రియాలిటీలో ఉందామన్న అర్థం ఈ టాటూ వెనకుందని చెప్పింది. ఆన్‌ స్ర్కీన్ మీద తామిద్దరం ఆర్టిస్టులం కాబట్టి, ఆఫ్ స్ర్కీన్‌లో రియాలిటీలో బతకాలన్నది తమ ఆలోచనని తెలిపింది. ఇదే విధమైన టాటూ చైతూ చెయ్యిమీద కూడా ఉందని ఆమె తెల్పింది.