“టార్చిలైట్” కి నో సెన్సార్

హీరోయిన్ సదా కీలక పాత్రలో ‘టార్చిలైట్‌’ అనే చిత్రం రూపొందుతోంది. చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్ సదా తాజాగా నటించిన ఈ చిత్రంలో నటించారు. వేశ్యావృత్తిలో మగ్గిపోతున్న అమ్మాయిల కథ ఆధారంగా ఎ. మజీద్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నో అందట.

సదా నటించిన టార్చిలైట్ సినిమాలో అశ్లీలత శాతం ఎక్కువగా ఉందని సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించిందట. ఇప్పటికే కొన్ని కారణాలతో సినిమా విడుదలలో జాప్యం జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా సెన్సార్ బోర్డ్ ఆటంకంతో మరింత ఆలస్యం అయ్యేట్టు కనిపిస్తోంది. సదా తొలిసారి వేశ్యపాత్రలో నటించిన సినిమా. గతంలో అనుష్క, శ్రియ, చార్మిలు వేశ్య పాత్రలు చేసి మెప్పించారు. సదా ఈ చిత్రంతో ప్రేక్షకులను ఏమేరకు మెప్పించగలుగుతుందో వేచి చూడాలి. పైగా ఈ చిత్రంపై సదా చాలా హోప్స్ పెట్టుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను చాలా ఇష్టపడి చేసిందట.