టీజర్ తో అంచనాలు రెట్టింపు!

గత కొంత కాలంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కి బ్యాడ్ టైమ్ నడుస్తున్న విషయం తెలిసిందే.  కొరటాల దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ తర్వాత వచ్చిన ‘బ్రహ్మోత్సవం’,’ స్పైడర్’ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో తన తదుపరి చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టాలన్న ఉద్దేశ్యంతో మరోసారి కొరటాల దర్శకత్వంలో నటిస్తున్నారు మహేష్ బాబు. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుదల కానున్న నేపధ్యంలో తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేశారు.

ఇందులో ‘చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది.. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే.. యు ఆర్ నాట్ కాల్డ్ ఏ మాన్ అని.. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు.. మర్చిపోలేదు.. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటొచ్చింది.. పెద్దదీ కాదు.. కష్టమైంది కూడా. .భరత్ అనే నేను’ అంటూ టీజర్ అంచనాలు పెంచేశారు. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అంచనాలు ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి!