టీడీపీకి గడ్డుకాలం.. బాబుకి గండం

ఓవైపు అభ్యర్థుల ఖరారు.. మరోవైపు ప్రతిపక్ష వైసీపీపై పదునైన విమర్శలు.. పైగా అధికారంలో ఉన్న పార్టీ.. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడంతా తిరుగులేకుండా ఉంది. కానీ ఇది ఇప్పుడు మాత్రమేనట.. మరికొద్దిరోజుల్లో మార్చి చివరి వారం నుంచి టీడీపీకి గడ్డుకాలం ఎదురువబోతోందని ప్రముఖ జ్యోతిష్య పండితులు ఘంఠా బజాయించి మరీ చెబుతున్నారు. టీడీపీకి పుణ్యకాలం ముగిసిందని.. ఈ నెలాఖరుతో చెడ్డకాలం వస్తుందని చెబుతున్నారు.

రాజకీయాల్లో సెంటిమెంట్లు ఎక్కువ.. సీఎం కేసీఆర్ అయితే వీటిని బాగా నమ్ముతారు. ఆయన అసెంబ్లీ రద్దు నుంచి మొదలు పెడితే అభ్యర్థుల ప్రకటన.. దానికి ముందు యాగాలు అన్నీ 6వ అంకె కలిసేటట్టు.. ముహూర్తాలు చూసుకొని మరీ మొదలు పెడుతారు. మంత్రివర్గ విస్తరణను ముహూర్తం చూసి సంఖ్యశాస్త్రం ప్రకారమే ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇప్పుడు ఏపీలో కూడా ఎన్నికల నగారా మోగడంతో పార్టీలన్నీ మంచి ముహూర్తాల కోసం అన్వేషిస్తున్నాయి. ఈరోజు ఉదయం 10.20కు మంచి మూహూర్తం ఉందని వైసీపీ భావించి తొలి జాబితాను సిద్ధం చేసినా.. నాయకుల తాకిడీ, భారీ చేరికలతో దాన్ని వాయిదా వేసింది. 16న ఉదయం 10.26 గంటలకు మరో మంచి ముహూర్తంలో అభ్యర్థుల ప్రకటనకు నిర్ణయించింది. టీడీపీ కూడా 16న మంచిరోజు కావడంతో అదే రోజు అభ్యర్థులను ప్రకటించి ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యింది.

అయితే అధికార పార్టీ కావడంతో కావాల్సినంత అడ్వంటేజ్ చంద్రబాబుకు ఉంటుంది. కానీ గ్రహాలు మాత్రం ఈసారి టీడీపీకి అనుకూలంగా లేవని జోతిష్య పండితులు చెబుతున్నారు. మార్చి చివరి వారంలో మొదలై ఆ తర్వాత ఏప్రిల్ వరకూ టీడీపీకి గడ్డుకాలం ఉందని అంటున్నారు.. మరి పోలింగ్ ఏప్రిల్ 11 వరకు టీడీపీకి శని దశ ఉండడంతో ఏం జరుగుతుందోనన్న టెన్సన్ తెలుగు తమ్ముళ్లలో నెలకొంది.