టీడీపీని చూస్తే జాలేస్తుంది: విష్ణు కుమార్ రాజు

ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు టీడీపీపై మండిపడ్డారు. ఏపీలో అధికార పార్టీ తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయిందని విమర్శించారు.. విశాఖ జిల్లాలో మీడియాలో మాట్లాడిన ఆయన… రైల్వే జోన్ ఆందోళన విషయంలో మంత్రి గంటా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అధికార దుర్వినియోగం చేస్తూ.. గూండాల రాష్ట్రంగా తయారు చేస్తున్నారని విమర్శించిన విష్ణుకుమార్ రాజు.. టీడీపీని చూస్తే జాలేస్తుంది అన్నారు.


సీఎం చంద్రబాబును కొంతమంది మంత్రులే తప్పుదోవ పట్టిస్తున్నారని.. వాటిని ఆయన గ్రహిస్తే మంచిదని హితవుపలికారు. మంత్రి గంటా తన గ్రాఫ్ పడిపోతోందని తెలిసే.. ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారని ఆరోపించిన విష్ణుకుమార్ రాజు.. రైల్వే జోన్ వస్తుందని తెలిసే అనవసరంగా నిరసనలు చేస్తున్నారని తప్పుపట్టారు విష్ణు కుమార్ రాజు.