‘టెంపర్’ రీమేక్ లో ప్రియా ప్రకాష్!

ఒక్క వీడియోతో యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్న మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ‘ఒరు అదార్‌ లవ్‌’ అనే మలయాళీ చిత్రంలో నటించిన ప్రియ ప్రకాశ్‌కు టాలీవుడ్‌ నుంచే కాదు బాలీవుడ్‌ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. పూరీ, ఎన్టీఆర్‌ కాంబీనేషన్‌లో వచ్చి బంపర్‌ హిట్‌గా నిలిచిన టెంపర్‌ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ అవబోతుందన్న విషయం తెలిసిందే. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో, కరణ్‌ జోహార్‌ నిర్మాణ సారథ్యంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ‘సింబా’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమాకు ప్రియాను కూడా తీసుకోవాలని కరణ్‌ జోహర్‌ ఆమెను సంప్రదించినట్లు సమాచారం.
ఒకవేళ అదే జరిగితే ఆ సినిమాలో ఆమెకు హీరోయిన్‌ పాత్ర ఇస్తారా?, లేక తెలుగులో మధురిమ చేసిన పాత్ర కోసమా? అనేది వేచి చూడాలి. అలాగే ఇదే నిజమైతే ప్రియాప్రకాష్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే. మొదట ఈ చిత్రంలో రణ్‌వీర్‌కి జోడీగా ఆలియా భట్‌, శ్రద్ధా కపూర్లు నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ప్రియ ప్రకాశ్‌ పేరు వినిపిస్తోంది. కరణ్‌ జోహార్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్‌ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.