ట్విట్టర్‌ వర్మ అసహనం.. వైరల్

రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనుకున్నట్టుగానే మార్చి 29 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా ప్రాంతాల్లో ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో విడుదలకు ఏపి హైకోర్ట్ నిరాకరించడంతో నిర్మాతలు సుప్రీం కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అంత తొందరేముంది.. అని సుప్రీం కోర్ట్ ప్రశ్నించి పిటిషన్ ను పక్కనపెట్టారు.

ఇక ఏప్రిల్ 3 వ తేదీన ఏపి హైకోర్ట్ లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఏదొక నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటే.. సుప్రీం కోర్ట్ లో కేసు పెండింగ్‌లో ఉందని చెప్పి ఏప్రిల్ 9 కి వాయిదా వేసింది. ఏపిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల ఇప్పట్లో ఉండకపోవచ్చని జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్ధం అవుతుంది. దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు వర్మ తన అసహనాన్ని కోతుల పెయింటింగ్ రూపంలో వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో షేర్స్ చేస్తున్నాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.