ట్వీట్‌తో ఇబ్బందుల్లో సమంత

ప్రముఖ నటి అక్కినేని సమంత అనవసరంగా కష్ఠాలు తెచ్చిపెట్టుకుంటున్నది. ఒక్కోసారి తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాట్లే వారికి ఇబ్బందులు తెచ్చిపెడతుంటాయి. ఇలాంటి ఇబ్బందులే ఇప్పుడు సమంతకు వచ్చాయి.

నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ గారు మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త విన్న సెలబ్రిటీలు షాక్ అయ్యారు. వెంటనే హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ చేసిన వాళ్లలో సమంత కూడా ఉన్నది. ఇలా చేసిన ట్వీట్ లో సమంత చిన్న పొరపాటు చేసింది. రెస్ట్ ఇన్ పీస్ హరికృష్ణ అని హ్యాష్ ట్యాగ్ చేస్తూ.. తన సంతాపాన్ని తెలిపింది. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. పెద్దవాళ్ళను గౌరవించడం నేర్చుకోవాలంటూ మండిపడ్డారు. దీంతో వెంటనే సమంత తను చేసిన పొరపాటును గమనించి ఆ ట్వీట్ ను డిలీట్ చేసి.. రెస్ట్ ఇన్ పీస్ హరికృష్ణ గారు అని మరో ట్వీట్ చేసింది. సమంత చేసిన రెండు ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.