డిఫరెంట్ కథతో శ్రీ విష్ణు

తెలుగు యువ హీరోల్లో శ్రీ విష్ణు ఒక‌డు. కెరీర్ మొదటి నుంచే ప్రేక్ష‌కులు మెచ్చే సినిమాలు చేస్తూ మంచి విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ”నీది నాది ఒకే క‌థ” చిత్రంతో మంచి విజయం ఖాతాలో వేసుకున్నాడు. ఇక త్వ‌ర‌లో ఈ యువ హీరో ఓ కొ్త్త సినిమా చేయబోతున్నాడు.వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. గ‌తంలో వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చిన మెంట‌ల్ మ‌దిలో చిత్రం మంచి విజ‌యం సాధించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే.


ఇప్పుడు చేయ‌బోయే ఈ చిత్రం క్రైమ్ నేప‌ధ్యంలో ఇంటెన్స్ ఉండ‌నుంది. మ‌రో వైపు కామెడీ కూడా ప్ర‌ధానం సాగుతుంద‌ని తెలుస్తోంది. శ్రీ విష్ణు కి ఈ చిత్రం బాగా ప్ల‌స్ కానుంది అని స‌మాచారం. ద‌ర్శ‌కుడు వివేక్‌… ఈ చిత్రం స్క్రిప్ట్ ను ఫ‌వ‌ర్ ఫుల్ గా రెడి చేసే ప‌నిలో ప‌డ్డాడ‌ట‌. ఈ సినిమా షూటింగ్ జూన్ మూడో వారం లో ప్రారంభం కానుంది. అలాగే జ్యోతి లక్ష్మీ సినిమాతో న‌టుడిగా మంచి గుర్తింపు పొందిన స‌త్య‌దేవ్ ఈ చిత్రం లో కీల‌క పాత్ర లో న‌టింలియ‌నున్నాయి.