డైరెక్టర్ మణిరత్నంకు గుండెపోటు

స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం (62) గుండెపోటుతో బాధపడుతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ఇండస్ర్టీకి చెందిన ఆయన మిత్రులు తీవ్ర ఆందోళనకు గురుయ్యారు. అయితే ఈ వార్త మణిరత్నం కుటుంబ సభ్యుల చెవిన పడటంతో వారు స్పంది ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు (గురవారం) మధ్యాహ్నం చెన్నైలోని అపోలో హాస్పిటల్‌ కు వెళ్లారు. రెగ్యులర్‌ చెక్‌ అప్‌ లో భాగంగా ఆయన హాస్పిటల్‌ కు వచ్చినట్లు తెలుస్తున్నది.

దర్శకుడు మణిరత్నం ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని వైద్యులు చెప్తున్నారు.. మణిరత్నం ఆరోగ్యంగానే ఉన్నారని.. అభిమానులు, మిత్రులు, సన్నిహితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘చెక్క చివంత వనం’ మూవీ ప్రొడక్షన్ పనుల్లో మణిరత్నం బిజీగా ఉన్నారు. మణిరత్నం.. కొలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు రోజా, దళపతి, నాయకుడు, ఓకే బంగారం, బొంబాయి, గురు వంటి సూపర్‌హిట్‌ సినిమాలను అందించారు. అంతేకాక మణిరత్నం సినీ నటి సుహాసిని భర్త.