డేటింగ్ చేస్తోన్న వరుణ్ హీరోయిన్!

డేటింగ్ చేస్తోన్న వరుణ్ హీరోయిన్!
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ప్పోరి జగన్నాథ్ రూపొందించిన ‘లోఫర్’ సినిమాతో హీరోయిన్ గా 
పరిచయమయింది దిశా పటాని. ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తోన్న ఈ భామకు ఓ యంగ్ హీరోతో 
ఎఫైర్ ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. బాలీవుడ్ లో ఇలాంటి రూమర్స్ కామన్. 
ఒకరితో మరొకరు డేటింగ్ చేస్తుండడం కూడా అక్కడ చాలా చిన్న విషయంగా పరిగణిస్తారు. అయితే 
ఈ ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్ళడం చాలా కష్టమనే చెప్పాలి. ఇప్పుడు దిశా కూడా టైగర్ ష్రాఫ్ 
తో డేటింగ్ లో ఉందని సమాచారం. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని చక్కగా తిరుగుతున్నారట. 
అయితే ఈ విషయంపై దిశా, టైగర్ ఇద్దరు స్పందించలేదు. వీరు ఈ విషయాలను ఖండించకపోవడంతో 
ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి!
CLICK HERE!! For the aha Latest Updates