డేటింగ్ పై దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా తాజాగా ప్రియుడు నీబోన్‌తో డేటింగ్‌, పెళ్లి లాంటి విషయాలపై ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు చక్కటి బదులిచ్చారు. అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. విదేశీ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్‌లో ఉన్న ఇలియానా చాలారోజుల కిందట హబ్బీ అని పోస్ట్‌ చేసి, ఇటీవల పోస్ట్‌లో మాత్రం మై లవ్‌ అని సంబోధించింది . ఓ విదేశీయుడితో మీరు ఎందురు డేటింగ్‌ చేస్తున్నారు, అతడిని మీ జీవిత భాగస్వామిగా ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తూ పోస్ట్‌ చేశారు.

‘ఓ వ్యక్తి మనసుతో నా మనసు ప్రేమలో పడింది. అతడి శరీర రంగు, జాతీయత (ఏ దేశం) లాంటి విషయాలు నాకు అనవసరం’ అంటూ బదులిచింది ఇలియానా. ప్రేమ, పెళ్లి గురించి తనను అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారంటూ ఇలియానా ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. మరోవైపు ఆండ్రూ నిబోన్‌తో వివాహం జరిగిందా అన్న ప్రశ్నకు సమాధానాన్ని మాత్రం ఎప్పటికప్పుడూ చాలా అందంగాదాటవేస్తుంది. ఇక ఈ సుందరి తరచూ ఏదో ఓ పోస్టుతో సోషల్‌ మీడియాలో టౌక్‌ ఆప్‌ ది టౌన్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే.