డ్రగ్స్ లేకుండా ఉండలేకపోతున్నాడట!

డ్రగ్స్ కు అలవాటు పడిన వారు అవి దొరక్కపోతే ఎలా ప్రవర్తిస్తారో.. చాలా సినిమాల్లో చూశాం. అలానే నిజ జీవితంలో కూడా మత్తు పదార్ధాలకు బానిసైన వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. హైదరాబాద్ లో చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేసిన కెల్విన్ కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడట. డ్రగ్స్ సప్లయ్ చేయకముందే కెల్విన్ వాటికి బానిస. అతడికి కూడా రోజు డ్రగ్స్ తీసుకోవడం అలవాటు. పది రోజుల నుండి పోలీస్ కస్టడీలో ఉన్న కారణంగా కెల్విన్ కు డ్రగ్స్ దొరకడం లేదు. దీంతో అతడు అసలు ఉండలేకపోతున్నాడని పోలీసులు చెబుతున్నారు. వందల మందికి డ్రగ్స్ అలవాటు చేసిన కెల్విన్ ఇప్పుడు మత్తు కోసం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడని తెలుస్తోంది.
తనకు సిగరెట్లు, డ్రగ్స్ కావాలని వేడుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు బయటకు రాగానే మీకు డబ్బు ఇస్తానని పోలీసులకు చెబుతున్నాడట. దీన్ని బట్టి కెల్విన్ డ్రగ్స్ కోసం ఎంతగా విలవిల్లాడుతున్నాడో తెలుస్తోంది. గతంలో కూడా కెల్విన్ ను ఓసారి అరెస్ట్ చేశారు. జైలులో గడిపి మళ్ళీ వచ్చి తన వ్యాపారాన్ని కొనసాగించాడు. ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగిస్తానని పోలీసుల దగ్గర చెబుతున్నాడట. మొదట్లో పోలీసులకు సహకరించిన తను ఇప్పుడు నిరాకరిస్తున్నాడని సమాచారం. 
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here