తండ్రీకొడుకులుగా రవితేజ

ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ ఈ సినిమా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే మరో చిత్రాని లైన్‌లో పెట్టాడు ఈ మాస్‌ మహారాజ్‌. “ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం” వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు అంగీకరించాడట. అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రంలో రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

అమర్‌ అక్బర్‌ ఆంటోనీ తరువాత ఆనంద్‌ డైరెక్షన్‌లో నటించే సినిమాలో తండ్రీగాను కొడుకుగా డ్యుయెల్‌ రోల్‌లో రవితేజ మెప్పించనున్నాడని సమాచారం. తండ్రీకొడుకులుగా రవితేజ నటిస్తున్నప్పటికీ రెండు పాత్రల మధ్య కీలక వ్యత్యాసం ఉంటుందని అదే సినిమాకు కీలకంగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు కథానాయికలు నటించానున్నారట. ఇప్పటి వరకూ కథనాయికలను ఎంపిక చేయలేదని దర్శకుడు వెల్లడించాడు.