తమన్నా మరో ఐటమ్‌ సాంగ్‌

నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం “సవ్యసాచి” ఈ చిత్రంతో కొత్త హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ పరిచయం కానుంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకుర్చనున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. అక్కినేని నాగార్జున కెరీర్‌లో మంచి హిట్‌ సినిమాగా నిలిచిన “అల్లరి అల్లుడు” చిత్రంలోని “నిన్ను రోడ్డు మీద చూసి” అనే పాటను ఈ చిత్రంలో రీమిక్స్‌ చేయబోతున్నారు. అయితే ఈ స్పెషల్‌ సాంగ్‌లో చేయడానికి చాలా మందిని సంప్రదించారట.

గతంలో ఐటమ్ పాంగ్స్‌ చేయడానికి ప్రత్యేకంగా ఉండేవారు. అయితే ఇప్పుడు హీరోయిన్సే స్పెషల్‌ సాంగ్స్‌ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ ఈ తరహా వాటికి తెరతీశారు. ఈ సాంగ్‌ కోసం తమన్నా ఎంపికైయింది. తమన్నా గతంలో అల్లుడు శీను, స్పీడున్నోడు, జైలవకుశ చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేసిన విషయం మనకు తెలిసిందే. నాగ చైతన్యతో 100% లవ్‌ సినిమాలోనూ నటించింది. తమన్నా ఈ సాంగ్‌లో చేయడానికి రూ.60 లక్షలు డిమాండ్‌ చేసిందని సమాచరం. ఆమె అడిగినంత ఇచ్చేందుకు మైత్రి మూవీ మేకర్స్‌ ఓకే చేపిందట.