తమన్ ను వాయిస్తున్నారట!

ఈ వారంలో మూడు సినిమాలు ‘ఇంటెలిజెంట్’,’గాయత్రి’,’తొలిప్రేమ’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే థియేటర్ల విషయంలో ఈ మూడు సినిమాల మధ్య చిన్నపాటి యుద్ధం జరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్లుమ బయ్యర్లు ఈ సినిమాల విషయంలో నలిగిపోతున్నారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఈ సినిమాల మధ్య చిక్కుకొని తెగ ఇబ్బంది పడుతున్నాడట. ఈ మూడు సినిమాలకు సంగీతం అందించింది తమనే. పాటలు పని ఎప్పుడో పూర్తయింది. కానీ రీరికార్డింగ్ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
మూడు సినిమాలు ఒకేసారి విడుదల కానుడడంతో ఇది ముందు ఇది తరువాత అని చేయడానికి కుదరదు. ఒకవైపు నిర్మాతల నుండి తమన్ కు ఒత్తిడి బాగా పెరిగినట్లు చెబుతున్నారు. ఇంటెలిజెంట్, తొలిప్రేమ సినిమాలకు కేటాయిస్తున్న సమయం గాయత్రికి కేటాయించడం లేదని ఆ చిత్ర దర్శకనిర్మాతలు తమన్ పై గుర్రుగా ఉన్నారట. మొత్తానికి తమన్ మాత్రం మూడు సినిమాల మధ్య నలిగిపోతున్నాడనేది స్పష్టంగా తెలుస్తోంది!