తమిళం అర్జున్‌ రెడ్డిలో శ్రియా శర్మ

టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండ నటించిన అర్జున్‌ రెడ్డి చిత్రం సూపర్‌ హిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాని ఇప్పుడు తమిళంలో వర్మ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో తమిళ స్టార్‌ హీరో తనయుడు ధృవ్‌ హీరోగా కోలీవుడ్‌తో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకి బాల దర్శకుడు.

ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రలో శ్రియా శర్మను ఎంపిక చేశారట. బాలనటిగా చిరంజీవి సినిమా జై చిరంజీవ, మహేశ్‌ బాబు దూకుడు మూవీల్లో నటించిన శ్రియా ఈ తర్వాత హీరోయిన్‌గా గాయకుడు, నిర్మలా కాన్మెంట్‌ సినిమాలలో నటించింది. ఈ రెండు చిత్రాలు ప్లాప్‌ కావడంతో ఆమె ఇప్పుడు కోలీవుడ్‌ పై దృష్టి పెట్టింది.