తమిళ‌ బిగ్‌బాస్‌ను నిషేధించలంటున్నహిందూ సంఘాలు

తమిళనాడులో బిగ్‌బాస్‌ షోను నిషేధించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హిందూ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. ప్రాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తూ.. అశ్లీలకరంగా నడుస్తున్న ఈ షోను వెంటనే నిషేధించాలంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. గురువారం చెన్నైలో ఈ షోను ప్రసారం చేస్తున్న విజయ్ టీవీకి, ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించాయి. ఈ సందర్బంగా హిందూ సంఘాల కార్యకర్తలు విజయ్ టీవీని ముట్టడించేందుకు ప్రయత్నించగా వారిని పోలీసుల అడ్డుకున్నారు.

పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు. తమిళ‌ బిగ్‌బాస్‌ షోపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. విజయ్ టీవీకి, కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా హిందూత్వ శ్రేణులు నినాదాలు చేశాయి. తమిళనాడులో బిగ్‌బాస్‌ షోను నిషేధించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హిందూ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
బిగ్‌బాస్‌ షో పూర్తిగా అశ్లీలకరంగా నడుస్తోందని, పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తోందని రోజురోజుకు తమిళనాడులో ఆందోళనలు ఉధృతమవుతాయంటూ.. తమిళ‌ బిగ్‌బాస్‌ షోపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి