తమిళ సినిమాలతో బిజీగా కీర్తి సురేష్

మహానటి సినిమా పెద్ద హిట్ తర్వాత కీర్తి సురేష్‌కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. సినిమాల ఎంపికలో కీర్తి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ చిత్రం తర్వాత తెలుగు సినిమా ఒక్కటీ ఒప్పుకోలేదు. కీర్తి దృష్టంతా ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపైనే ఉంది. కీర్తి సురేష్ నేటితరం మహానటి. సావిత్రి పాత్రలో నటించడమంటే మామూలు విషయం కాదు. కానీ అది చేసి చూపించింది ఈ ముద్దుగుమ్మ. మహానటి విజయంలో కీర్తి పాత్ర కూడా కీలకమే. దర్శకుడు ఎంత బాగా తీసినా ఈమె చేయకుంటే ఫలితం మరోలా ఉంటుంది. దాంతో కీర్తికి ప్రశంసల జల్లు కురుస్తోంది. మహానటి తర్వాత కీర్తికి తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నా దేనికీ సైన్ చేయలేదు. అంతకు ముందు నేను-శైలజ, నేను-లోకల్‌తో రెండు విజయాలందుకున్నకీర్తి సురేష్‌కు అజ్ఞాతవాసి కోలుకోలేని షాకిచ్చింది. ఆ సినిమాతో స్టార్ హీరోయిన్‌ అవుతుందనుకున్న కీర్తి ఫ్లాప్ హీరోయిన్‌ అయిపోయింది. లక్ బాగుండి మహానటితో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

అయితే అజ్ఞాత వాసి తర్వాత స్టార్ హీరోలున్నారు కదాని కీర్తి ఏది పడితే దానికి ఓకే చెప్పడం లేదు. ప్రస్తుతం కీర్తి తన దృష్టంతా తమిళ ఇండస్ట్రీపైనే పెట్టింది. ప్రస్తుతం కీర్తి తమిళంలో విక్రమ్ సరసన సామిస్క్వేర్, విజయ్‌తో మురుగదాస్ సినిమా, విశాల్‌తో పందెంకోడి2 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాలతో తమిళంలో కీర్తి రేంజ్ పెరగడం ఖాయం. ఇక తెలుగులో రాజమౌళి మల్టీస్టారర్ మూవీలో కీర్తిని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగులో కీర్తిని ఒప్పించడం దర్శక, నిర్మాతలకు కష్టమైపోయిందట.