తలైవా నెక్ట్స్ సినిమా షూటింగ్ స్టార్ట్

సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న 2.0 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశముంది. ఇక రజనీ తన తరువాతి సినిమాపై దృష్టి పెట్టారు.

యువదర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో రజనీ ఓ సినిమాను చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాబీ సింహా, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తాజాగా ఇవాళ డార్జిలింగ్‌లో షూటింగ్ ప్రారంభించారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.