తల్లి కాబోతున్న ప్రియమణి..!!

నటి ప్రియమణి ఎన్నో చిత్రల్లో నటించినప్పటికీ జగపతి బాబు తో పెళ్ళైన కొత్తలో, ఎన్టీఆర్ తో యమదొంగ, గోపీచంద్ గోలీమార్‌ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘మగాళ్లు ఒట్టి మాయగాళ్లే.. ప్రేమంటే ఏమిటో తెలీదే’ అంటూ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. కానీ తన స్టార్‌డమ్‌ని ఎక్కువకాలం నిలువులోలేక పోయింది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం వివాహం చేసుకుంది.

ఇటీవల ఓ ప్రముఖ చానెల్‌లో డ్యాన్స్‌ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. ప్రస్తుతం ప్రియమణి తల్లి కాబోతోందనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఈ వార్తపై ప్రియామణి ఎటువంటి స్పందన తెలియాజేయాలేదు. ఈ వార్తలో నిజం ఎంత ఉంది అనేది ఆమె స్పందన ద్వారానే తెలుస్తుంది.

CLICK HERE!! For the aha Latest Updates