తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం: లోకేష్

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు వస్తాయో రావో తెలియని పరిస్థితి ఉందని, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలో పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని లోకేష్ తెలిపారు. ఎన్నికల కోసం పార్టీ రెడీ, మా కార్యకర్తలు రెడీ అని అన్నారు. ఏపీలో గాని, తెలంగాణలో గాని బలమైన కార్యకర్తలున్న పార్టీ టీడీపీ అని అన్నారు. నాయకులు కొంతమంది వెళ్లిపోయి ఉండొచ్చు కానీ కార్యకర్తలు ఎక్కడికీ వెళ్లిపోలేదని లోకేష్ తెలిపారు. వాళ్లే ఈరోజు పార్టీని నిలబెడుతున్నారని అన్నారు.