తేజు దగ్గర రెజీనా టాపిక్!

మెగాహీరో సాయి ధరం తేజ్ కు నటి రెజీనాకు మధ్య ప్రేమాయణం సాగిందని టాలీవుడ్ అప్పట్లో వార్తలు బాగా వినిపించేవి. వీరిద్దరూ కలిసి వరుస సినిమాల్లో నటించడంతో ఈ వార్తలకు మరింత ఊతమోచ్చినట్లు అయింది. పైగా ఇద్దరూ బయట కూడా క్లోజ్ గా ఉండటంతో అంతా నిజమేనని అనుకున్నారు. ఈ విషయంపై స్పందించిన వీరిద్దరూ తాము మంచి స్నేహితులం మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు. అయితే రీసెంట్ గా రెజీనా తను ప్రేమలో మోసపోయానని దాని కారణంగా కెరీర్ పై కూడా దెబ్బ పడిందని స్టేట్మెంట్ ఇచ్చింది.

ఈ విషయంపై కొన్నిరోజులు టాపిక్ బాగానే నడిచింది. తాజాగా ఈ ఇదే విషయాన్ని తేజు వద్ద ప్రస్తావించగా.. ‘అది రెజీనా వ్యక్తిగత విషయం. దానిపై నేను కామెంట్ ఎలా చేయగలను. అది తప్పు’ అంటూ మెల్లగా జారుకున్నాడు. అప్పట్లో అంత స్నేహంగా ఉన్న వీరిద్దరూ కొద్దిరోజులుగా మాత్రం సరిగ్గా ఉండడం లేదని టాక్.