‘తేజ్‌ ఐ లవ్‌ యూ’ ట్రైలర్‌

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌కు ప్రస్తుతం ఓ హిట్‌ కావాలి. మెగా హీరోల్లో గత కొంతకాలం పాటు విజయాలు లేక డీలాపడ్డాడు. వరుస డిజాస్టర్స్‌తో ఉన్న ఈ హీరో, తన టాలెంట్‌ని మళ్లీ ప్రూవ్‌ చేసుకోవాలని చూస్తోన్న డైరెక్టర్‌ కరుణాకరన్‌తో కలిసి తీసిన సినిమా ‘తేజ్‌ ఐ లవ్‌ యూ’.

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌, లుక్స్‌, పాటలకు సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ కామెంట్సే వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అనుపమా పరమేశ్వరన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కూతురు గా కనిపిస్తోంది, సాయి ధరమ్‌ తేజ్, అనుపమా ను టీజ్‌ చేస్తుంటాడు. ఈ టీజర్‌లో వీరి జంటకు మంచి మార్కులే పడుతున్నాయి. గోపి సుందర్‌ అందించిన సంగీతం కూడా బాగానే ఉంది. క్రియేటివ్‌ కమర్షియల్‌ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు నిర్మించిన ఈ సినిమా జూలై 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.